తమిళ భాష విషయ సూచిక చరిత్ర తమిళం గురించి తమిళ దినపత్రికలు కొన్ని ప్రాథమిక పదాలు తరచూ వాడే కొన్ని వాక్యాలు మార్గదర్శకపు మెనూee
విస్తరణ కోరబడిన వ్యాసములుభారతీయ భాషలుద్రావిడ భాషలు
దక్షిణ భారతదేశంశ్రీలంకసింగపూర్తెలుగుతెలుగుకన్నడమలయాళం
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:14px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003E"u003Cbu003Eతెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ u003Ca href="/wiki/%E0%B0%97%E0%B1%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AE%E0%B1%8D" title="గూగుల్ క్రోమ్"u003Eక్రోమ్ బ్రౌజరుu003C/au003E లో u003Ca href="/wiki/%E0%B0%97%E0%B1%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3" title="గూగుల్ లిప్యంతరీకరణ"u003Eగూగుల్ లిప్యంతరీకరణu003C/au003E పద్ధతిని వాడవచ్చు.u003C/bu003E" u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
తమిళ భాష
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
తమిళం లేదా అరవం (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. దక్షిణ భారతదేశం, శ్రీలంక, సింగపూర్ లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. తమిళం దక్షిణ భారత దేశంలో తెలుగు తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
విషయ సూచిక
1 చరిత్ర
2 తమిళం గురించి
3 తమిళ దినపత్రికలు
4 కొన్ని ప్రాథమిక పదాలు
5 తరచూ వాడే కొన్ని వాక్యాలు
చరిత్ర
ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలు ఉన్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించినదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్ల సుదీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా తెలుగు, కన్నడ భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది.
తమిళ భాషకి అత్యంతము దగ్గర పోలికలు గల భాష మలయాళం అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళ భాషకి ఉప భాషలుగా వాడుకలో ఉన్నాయి.
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన క్రీ.పూ.3వ శతాబ్దంలో జరిగినని ఆధారాలు ఉన్నాయి. 'సంగమ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
- సంగమ కాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
- సంగమ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
- భక్తి సాహిత్య కాలం ( క్రీ.శ.700 - క్రీ.శ.1200)
- మధ్య కాలం ( క్రీ.శ.1200 - క్రీ.శ.1800)
- ప్రస్తుత కాలం ( క్రీ.శ.1800 - ఇప్పటి వరకు).
భక్తి సాహిత్య కాలంలో మరియు మధ్య సాహిత్య కాలంలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది భాషల పలు పదాలు తమిళంలో కలిసినవి. తరువాతి కాలంలో 'పరిధిమార్ కళైఞర్' (1870 - 1903), 'మరైమలై అడిగళ్' (1876-1950) మొదలైన సంస్కర్తలు ఈ పదాలను తమిళ భాషనుంచి తొలగించే ప్రయత్నం చేసారు. "స్వచ్ఛమైన తమిళ్" అనే నినాదం ఈ కాలంలో వెలువడింది.
తమిళం గురించి
కోయంబత్తూరులో జరిగిన ప్రపంచ ప్రాచీన తమిళ మహానాడు ఆమోదించిన తీర్మానాలపై ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్ననిర్ణయాలు ఇవి :
- తమిళానికి కేంద్రంలో అధికార భాషా హోదా కల్పించాలి.ఈ అంశంపై పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించి దానిపై చర్చించాలి.
- మద్రాసు హైకోర్టులో తమిళంలో వాదనలకు అనుమతించాలి. దీనిపై 2006లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
- తమిళ భాషాభివృద్ధికి పరిశోధనలకు అవసరమైన రాయితీ నిధులను కేంద్రం ఇవ్వాలి.రాష్ట్రంలో శాసన అధ్యయనా కేంద్రం నెలకొల్పాలి.
- తమిళంలో చదువుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగావకాశాలు, ప్రాధాన్యత ఇవ్వాలి.
- పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో తమిళ ప్రాచీన భాషా శీర్షికను చేర్చాలి.
- తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
- తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
- కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి - జయలలిత.
తమిళము, సంస్కృతం కన్నా చాలా పురాతనమైనది. తమిళ భాష 2600-1700 క్రీ.పూ. నుండే ఉంది. 1000 క్రీ.పూ. ముందు సింధు లోయలో కనబడిన ఋగ్వేదములో కూడా ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి -- అస్కో పర్పోలా, ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకీ, ఫిన్లాండ్)- సింధు లోయ నాగరికతా భాష తమిళమే - డా.అంబేద్కర్
తమిళ దినపత్రికలు
- దినకరన్
- దినతంతి
- దినమలర్
- దినమణి
- దినమేధ
కొన్ని ప్రాథమిక పదాలు
- నాన్ - నేను
- నీ - నీవు
- నీంగళ్ - మీరు
- అవన్ - అతను
- అవళ్ - ఆమె
- అవర్గళ్ - వారు
- ఇవన్ - ఇతను
- ఇవళ్ - ఈమె
- ఇవర్గళ్ - వీరు
తరచూ వాడే కొన్ని వాక్యాలు
- నమస్కారము: వణక్కమ్
- బాగున్నారా? : నల్లా ఇరుకీంగళా/సౌక్యమా ఇరుకీంగళా.?
- మీ పేరు ఏంటి? : ఉంగళ్ పేరు ఎన్న?
- నా పేరు లక్ష్మి: ఎన్ పేర్ లట్చ్మి
- దయచేసి: దయవసెయిదు
- ధన్యవాదము: నన్ఱి (నండ్రి)
- నాకు తమిళం తెలియదు: ఎనక్కు తమిళ్ తెరియాదు
- క్షమించండి: మన్నిక్కవుం/మన్నిచిరుంగ
- అది: అదు
- ఇది: ఇదు
- ఏది: ఎదు
- రండి, కూర్చోండి :వాంగ, ఉట్కారుంగ (వ్యావహారికం: వక్కారుంగ)
- ఎంత?: ఎవ్వళవు
- ఎక్కడ: ఎంగ
- అవును: ఆమాం
- లేదు: ఇల్లై
- నాకు అర్ధం కాలేదు: ఎనక్కు పురియవిల్లై
- మరుగు దొడ్డి ఎక్కడ?: కళివరై ఎంగ ఇరుక్కు
- మీకు ఆంగ్లము తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా?
- సమయం ఎంత - నేరం ఎన్నాచ్చు
వర్గాలు:
- విస్తరణ కోరబడిన వ్యాసములు
- భారతీయ భాషలు
- ద్రావిడ భాషలు
(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.084","walltime":"0.140","ppvisitednodes":"value":192,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":26583,"limit":2097152,"templateargumentsize":"value":0,"limit":2097152,"expansiondepth":"value":5,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":0,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 92.996 1 -total"," 65.41% 60.832 1 మూస:విస్తరణ"," 61.66% 57.338 1 మూస:Ambox"," 25.85% 24.038 2 మూస:Navbox"," 25.85% 24.035 1 మూస:ద్రవిడ_భాషలు"," 8.43% 7.842 1 మూస:భారతీయ_భాషలు"," 4.00% 3.723 47 మూస:·"],"scribunto":"limitreport-timeusage":"value":"0.017","limit":"10.000","limitreport-memusage":"value":944011,"limit":52428800,"cachereport":"origin":"mw1307","timestamp":"20191011123845","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c24u0c2eu0c3fu0c33 u0c2du0c3eu0c37","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7","sameAs":"http://www.wikidata.org/entity/Q5885","mainEntity":"http://www.wikidata.org/entity/Q5885","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2005-06-14T16:56:13Z","dateModified":"2018-05-09T15:13:25Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/c/ca/Zhakaram.PNG","headline":"u0c26u0c4du0c30u0c35u0c3fu0c21 u0c35u0c30u0c4du0c17u0c3eu0c28u0c3fu0c15u0c3f u0c1au0c46u0c02u0c26u0c3fu0c28 u0c12u0c15 u0c2du0c3eu0c30u0c24u0c40u0c2f u0c2du0c3eu0c37"(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":165,"wgHostname":"mw1332"););